శ్రీ దే వు ల ప ల్లి కృ ష్ణ శా స్త్రి కవిత:
** ఎందు కొరకు -- ఎవరి కెరుక ?
ఎగుడు దిగుడుల బ్రతుకు
ఎందుకొరకు ?
తెగదా సమస్య , ఈ నాటి వరకు !
చిగురు పెడితే వసంత మ్మని , ఎగసి పడి
మొగిలు పడితే వాన కా రని, దిగులిపడి
ఎగసి పడి దిగులు పడి, సొగసి పోవుటే గాని
ఎందుకొరకు ?
వెలుగు నీడల పడుగు పేకలా ఎవరు
కలిపి నేసిరో బ్రతుకు కొకలా
ఆశల నిరాశ లను తొరపి, ఎవరు
పోసిరో ఈ బ్రతుకు మూసలా
అయితే -- బ్రదు కంతా యిది వ్యర్ధ మైనదా ?
కాదు -- పరికిస్తే ఎదో అర్ధమున్నదీ !
ఎందుకొరకు ?
అరుణ కాంచన మేఘమాల కౌగిలి లో
ఎరి గెరిగి ఎవరో చీకట్లు ప్రాకిస్తారు
ఎందుకొరకు ?
( ఈ కవితను " అమృత వీణ " కవితా సంపుటి నుంచి సేకరించ బడినది )
** ఎందు కొరకు -- ఎవరి కెరుక ?
ఎగుడు దిగుడుల బ్రతుకు
ఎందుకొరకు ?
తెగదా సమస్య , ఈ నాటి వరకు !
చిగురు పెడితే వసంత మ్మని , ఎగసి పడి
మొగిలు పడితే వాన కా రని, దిగులిపడి
ఎగసి పడి దిగులు పడి, సొగసి పోవుటే గాని
ఎందుకొరకు ?
వెలుగు నీడల పడుగు పేకలా ఎవరు
కలిపి నేసిరో బ్రతుకు కొకలా
ఆశల నిరాశ లను తొరపి, ఎవరు
పోసిరో ఈ బ్రతుకు మూసలా
అయితే -- బ్రదు కంతా యిది వ్యర్ధ మైనదా ?
కాదు -- పరికిస్తే ఎదో అర్ధమున్నదీ !
ఎందుకొరకు ?
అరుణ కాంచన మేఘమాల కౌగిలి లో
ఎరి గెరిగి ఎవరో చీకట్లు ప్రాకిస్తారు
అలుము కొన్న కారు రేయి లోగిలి లో
తెలిసి ఎవరో తార దివ్వె పెడతారుఎందుకొరకు ?
( ఈ కవితను " అమృత వీణ " కవితా సంపుటి నుంచి సేకరించ బడినది )
No comments:
Post a Comment