Sunday, January 6, 2013

 ** చేత వెన్న ముద్ద,  చెంగల్వ పూదండ
        బంగరు మొలత్ర్రాడు, పట్టుదట్టి
        సందె తాయతులను, సరిమువ్వ గజ్జెలు
        చిన్న కృష్ణ,  నిన్ను చేరు కొలుతు .......... ( ఆటవెలది )

అన్నమయ్య  పద్య శతకం నుంచి గ్రహించ బడినది.
40 సం. ల  క్రితం 1వ లేక 2వ తరగతి లో తెలుగు పుస్తకం ద్వారా
విద్యార్ధులకు పరిచయం చేయబడినది.


Sunday, December 16, 2012

శ్రీ దే వు ల ప ల్లి  కృ ష్ణ శా స్త్రి  కవిత:

** ఎందు కొరకు  -- ఎవరి కెరుక ?
             ఎగుడు దిగుడుల బ్రతుకు
                                            ఎందుకొరకు ?
     తెగదా సమస్య ,  ఈ నాటి వరకు !
             చిగురు పెడితే వసంత మ్మని , ఎగసి పడి
     మొగిలు పడితే వాన  కా రని, దిగులిపడి
     ఎగసి పడి దిగులు పడి, సొగసి పోవుటే గాని
                                            ఎందుకొరకు ?
    వెలుగు నీడల  పడుగు  పేకలా  ఎవరు
                  కలిపి నేసిరో బ్రతుకు  కొకలా
    ఆశల నిరాశ లను తొరపి, ఎవరు
                  పోసిరో ఈ బ్రతుకు మూసలా
    అయితే  -- బ్రదు  కంతా  యిది వ్యర్ధ మైనదా ?
              కాదు -- పరికిస్తే ఎదో అర్ధమున్నదీ !
                                           ఎందుకొరకు ?
    అరుణ కాంచన మేఘమాల కౌగిలి లో
                 ఎరి గెరిగి ఎవరో చీకట్లు ప్రాకిస్తారు
    అలుము కొన్న కారు రేయి లోగిలి లో 
                 తెలిసి ఎవరో తార  దివ్వె పెడతారు
                                          ఎందుకొరకు ?

  ( ఈ కవితను " అమృత వీణ "  కవితా సంపుటి నుంచి సేకరించ బడినది )